ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన విజయ్
- ఫలితాల తర్వాత ఎక్స్ వేదికగా తొలిసారి విజయ్ స్పందన
- ప్రజాశ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమన్న విజయ్
- ఈ కృషిలో కేంద్రం సహకారం కావాలని ప్రధానికి విజ్ఞప్తి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ థ్యాంక్స్ చెప్పారు. 'ఎక్స్' వేదికగా ఆయన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే పార్టీ 108 సీట్లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ విజయాన్ని అభినందించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఫలితాల తర్వాత ఆయన 'ఎక్స్' వేదికగా తొలిసారి స్పందిస్తూ, ప్రజా శ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతి, తమిళనాడు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ కృషిలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన రాహుల్ గాంధీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించేందుకు సమష్టి సహకారం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని విజయ్ అన్నారు.